గత కొన్ని నెలల నుంచి టీమ్ ఇండియాలోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే సత్తా చాటారు. కానీ చాలామంది ఆటగాళ్లు ఆ తర్వాత కాలంలో భారత జట్టులో కనిపించకుండా పోయారు. కానీ ఇలా వచ్చి పాతుకుపోయిన ఆటగాడు ఎవరు అంటే అతను శుభమన్ గిల్ అని చెప్పాలి. ఎందుకంటే అందరిలాగానే అతను కూడా భారత జట్టులోకి వచ్చాడు. కానీ తన ఆట తీరుతో ప్రస్తుతం టీమిండియాలో త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా కూడా మారిపోయాడు అని చెప్పాలి.


 ఏకంగా సెంచరీల మోత మోగిస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న ఆసియా కప్ లో కూడా కీలక ప్లేయర్ గా కొనసాగిన గిల్ ఇక వన్డే వరల్డ్ కప్ లో కూడా భారత జట్టుకు మంచి ఇన్నింగ్స్ లతో విజయాలను అందించగలడు అని అటు అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ ప్రదర్శన గురించి మాజీ ప్లేయర్ సురేష్ రైనా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు.


 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాలో గిల్ చాలా ముఖ్యమైన ఆటగాడు అవుతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సురేష్ రైనా. అతను టీమిండియా కు మరో విరాట్ కోహ్లీలా మారాలి అని అనుకుంటున్నాడు. అతడిలో ఆ సత్తా ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ వన్డే ప్రపంచ కప్ తర్వాత గిల్ గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసినట్లుగానే.. ఈసారి గిల్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: