
అయితే ఈ వన్డే సిరీస్ లో భాగంగా మొదటి రెండు వన్డే మ్యాచ్ లకి అటు భారత జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ లకు సెలక్టర్లు విశ్రాంతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే సీనియర్లకు తరచూ విశ్రాంతి ఇవ్వడంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్ లో గట్టిగా లెక్క పెట్టుకుంటే మొత్తం కలిపి కేవలం టీమిండియా ఆటగాళ్లు ఆడింది రెండు మ్యాచ్లే. అలాంటిది ఇక ఇద్దరికీ రెండు మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వడమేంటి అని అందరూ బిసిసిఐ ని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇలా ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డే మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చాడు. అందరం చర్చించాకే వాళ్లకు రెస్ట్ ఇచ్చాము. వరల్డ్ కప్ ముంగిట శారీరకంగా మానసికంగా ఫ్రెష్ గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ రాకతో ఇక టీం మరింత బలంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు అతనుఒక క్వాలిటీ ప్లేయర్ అంటూ తెలిపాడు. అయితే జట్టులో ఎవరైనా గాయపడితే వారికి బ్యాకప్ గా మరో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్ .