
అయితే మొదటిసారి 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీ లో భారత జట్టు వరల్డ్ కప్ లో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2011లో భారత్ చరిత్రను పురనామృతం చేసింది. సొంత గడ్డపై ధోని కెప్టెన్సీ లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఇక ఇప్పుడు మూడోసారి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ అందరు కూడా భావిస్తున్నారు. దీనికి పక్కా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటూ చెబుతున్నారు.
అయితే టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ప్రపంచ కప్ భారత్లో జరుగుతూ ఉండడమే. 2017లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ టైటిల్ ని గెలిచినప్పుడు. అదే టోర్నీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇక అదే సమయంలో 2019 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టు మొదటిసారి వన్డే వరల్డ్ కప్ గెలవగా.. ఆ సమయంలోనే ఇంగ్లాండ్ జట్టు వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు భారత జట్టు వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాదిరిగానే భారత జట్టుకు కూడా ఈ మొదటి ర్యాంక్ కలిసి వస్తుందని విశ్వవిజేతగా నిలవడం ఖాయమని అభిమానులందరూ కూడా భావిస్తున్నారు.