
కానీ కొంతమంది క్రికెట్ విశ్లేషకులు మాత్రం జడేజా ఆట తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే వన్డే ఫార్మాట్లో భారత్ లో అటు జడేజాకు పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డులు ఏమీ లేవు. అదే కాదు గత కొంతకాలం నుంచి టెస్ట్, టి 20 ఫార్మాట్లలో అదరగొడుతున్న రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లో ఆడటం లేదు అని చెప్పాలి. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో 12 ఇన్నింగ్స్ లలో.. 27 యావరేజ్ తో 189 పరుగులు మాత్రమే చేశాడు. 14 నెలల నుంచి అతను ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.
అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఇక టెస్ట్ ఫార్మాట్లో కూడా అదరగొట్టిన రవీంద్ర జడేజా.. వన్డేలలో మాత్రం కనీసం హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోతున్నాడు. మరి ముఖ్యంగా స్వదేశంలో అయితే జడేజాకు చెత్త రికార్డులే ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాలి. ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా.. జడేగా జట్టుకు ఎలా ఉపయోగపడతాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.