
ముఖ్యంగా లీగ్ దశను ముగించుకొని సెమీఫైనల్ చేరడం పైనే అన్ని జట్లు కూడా ప్రస్తుతం ప్రణాళికలను రచిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఏ టీం అత్యుత్తమ ప్రదర్శన చేసి సెమీఫైనల్ వరకు చేరుకుంటుంది. ఇక ఫైనల్ లో నిలబడుతుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెబుతూ ఉన్నారు. అయితే ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఈ ప్రపంచకప్ లో ఏ టీం సెమీఫైనల్ వరకు చేరుతాయి అనే విషయాన్ని ముందే అంచనా వేశాడు.
ఈ ఏడాది వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరుకునే జట్లలో దక్షిణాఫ్రికా తప్పకుండా ఉంటుందని యువరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు కూడా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ కప్ లో ఎప్పుడూ ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. అందుకే నేను సెమీఫైనల్ వెళ్ళబోయే జాబితాలో ఐదు జట్లను ఎంచుకుంటాను. అందుకే దక్షిణాఫ్రికా కూడా సెమీఫైనల్కు వెళ్లే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాను. ఎందుకంటే ఆ జట్టుకు వైట్ బాల్ ట్రోఫీ ఎంతగానో అవసరం అంటూ యువరాజ్ చెప్పుకొచ్చాడు.