మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ వరల్డ్ కప్ అటు టీం ఇండియాకు ఎంతో స్పెషల్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే 2011లో ధోని కెప్టెన్సీ లో సొంత గడ్డపై జరిగిన వరల్డ్కప్ లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది టీం ఇండియా. ఇక ఇప్పుడు పుష్కరకాలం తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చింది. సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని భారత జట్టు విశ్వ విజేతగా నిలవాలని ఆశపడుతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి అందరని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండడం.. ఇక ఇప్పటికే మొన్నటికీ మొన్న జరిగిన ఆసియా కప్లో విజయం సాధించడం.. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లోనూ అదరగొట్టడంతో ఇక టీమిండియా కు తిరుగులేదు అని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియాలో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఎంతో మాజీలు రివ్యూలు ఇవ్వడం విషయంలో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇక అటు బీసీసీఐ కూడా ఎన్నో విషయాలను అటు అభిమానులతో పంచుకుంటూ ఉండటం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇటీవల బిసిసిఐ చేసిన ఒక పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉండి ఇంకా ఇప్పుడు 2023 వరల్డ్ కప్ ఆడబోతున్న ఆటగాళ్లు కేవలం కోహ్లీ, అశ్విన్ మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరికీ సంబంధించి ప్రత్యేకమైన ఫోటోలును డిజైన్ చేసింది బీసీసీఐ. 2011లో కోహ్లీ 2023లో కోహ్లీతో ఉన్నట్లు ఒక ఫోటో.. 2011లో అశ్విన్ 223లో అశ్విన్ తో ఉన్నట్లు మరో ఫోటోను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: