మొన్నటి వరకు వరల్డ్ కప్ లో భాగంగా ట్రోఫీ కోసం వీరోచితమైన పోరాటం చేసిన జట్లు ప్రస్తుతం ఇక ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ విదేశీ పర్యటనలకు వెళ్తుంటే మరికొన్ని టీమ్స్ స్వదేశంలోనే విదేశీ టీమ్స్ తో మ్యాచ్ లు ఆడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం న్యూజిలాండ్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా తప్పకుండా న్యూజిలాండ్ దే పైచేయిగా కొనసాగుతూ ఉంటుంది.


 ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్ గా కొనసాగుతున్న న్యూజిలాండ్ జట్టు ఇక బంగ్లాదేశ్ పై ఎంతో అలవోకగా  విజయం సాధించడం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ బంగ్లా టీం ఘన విజయాన్ని  అందుకని చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇలా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరిలో బంగ్లా జట్టు విజయం సాధించడంతో.. జట్టు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.


 అయితే ఇలా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లకి ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది  అని చెప్పాలి. జట్టులోని ప్లేయర్స్ అందరికి కూడా బోనస్ ఇవ్వబోతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ కోర్టు ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని బంగ్లా బోర్డు ప్రతినిధి జలాల్ యునస్ తెలిపారు. సొంత గడ్డపై కివిస్ పై తొలి విజయం సాధించడం సంతోషంగా ఉంది. తమ జట్టు డాకాకు చేరుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వారితో డిన్నర్ చేస్తారని.. ఆ తర్వాత బోనస్ కూడా ప్రకటిస్తారు అంటూ జలాల్ యునస్ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: