మొన్నటి వరకు వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు ఆడుతూ బిజీబిజీగా గడిపాయ్ ప్రపంచ దేశాల్లోని అన్ని టీమ్స్. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టైటిల్ గెలవడం కోసం అన్ని టీమ్స్ కూడా వీరోచితంగా పోరాటం చేశాయి అని చెప్పాలి. అయితే ఏ పోరాటంలో అయినా సరే విజయం సాధించేది ఒక్కరు మాత్రమే. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆరవసారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అన్ని టీమ్స్ కూడా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో కూడా ఆయా టీమ్స్ సిరీస్ లు ఆడుతూ ఉండడం గమమార్హం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతూ ఉంది. ఇటీవల ఆంటీగ్వా  వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే  మ్యాచ్లో వెస్టిండీస్ అదరగొట్టేసింది అని చెప్పాలి. ఇంగ్లీష్ టీం పై పూర్తి ఆధిపత్యం చెలాయించి మొదటి వన్డే మ్యాచ్ లో విజయం సాధించింది. ఏకంగా నాలుగు వికెట్లు తేడాతో విక్టరీ అందుకుంది వెస్టిండీస్ జట్టు.


 325 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ టార్గెట్ ను 48.5 ఓవర్లలోనే చేదించింది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఏకంగా 109 పరుగులతో సెంచరీ చేసి అదరగొట్టాడు. చివర్లో షెఫర్డ్ మెరుపులు మెర్పించి 49 పరుగులు చేయడంతో ఇక వెస్ట్ ఇండీస్ కు విజయం కాస్త ఈజీగానే వరించింది అని చెప్పాలి. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హరిబ్రూక్ బ్యాట్ ఝలిపించి  ఏకంగా 71 పరుగులు చేశాడు. హరిబ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ తోనే ఇంగ్లాండ్ స్కోర్ 300 పరుగులు దాటింది అని చెప్పాలి. ఇలా వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్లో విజయం సాధించి ఇంగ్లాండ్ పై ఆదిక్యాన్ని అందుకుంది వెస్టిండీస్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: