అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా చాలామంది ప్లేయర్స్ తమ ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అయితే జట్టు జయాపజాయాలతో సంబంధం లేకుండా కేవలం తమ వ్యక్తిగత ప్రదర్శన విషయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు ప్రత్యేకమైన అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది.



 ఇక ఐసిసి ర్యాంకింగ్స్   ద్వారా ప్రోత్సాహాన్ని అందించడమే కాదు.. ఇక ఒక నెల మొత్తంలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రేయర్ ఆఫ్ ది మంత్  అవార్డులను కూడా ఇవ్వడం చేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. గత కొంతకాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ కి సంబంధించిన నామినేషన్స్ ప్రకటించింది అంటే చాలు అందులో ఏ ఆటగాడు అవార్డును అందుకుంటారు అన్న చర్చ అటు వరల్డ్ క్రికెట్లో మొదలవుతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల వివరాలను సేకరించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ జాబితాలో భారత జట్టు నుంచి ఒకే ఒక ప్లేయర్ మాత్రమే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లు ట్రావెస్ హెడ్,  మాక్స్వెల్ తో పాటు టీమిండియా ఫేసర్ మహ్మద్ షమీ ఇందులో చోటు దక్కించుకున్నాడు. నవంబర్లో హెడ్ 220 పరుగులు, మాక్స్వెల్ 205 పరుగులు చేయగా.. షమీ ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఎకానమీ 5.68 గా ఉంది. యావరేజ్ 12.06 గా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc