2024 ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచే బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఐపీఎల్ లో పాల్గొంటున్న 10 టీమ్స్ కూడా తమ జట్టు నుంచి వదులుకోబోయే ఆటగాళ్ల వివరాలను ఇప్పటికే సమర్పించాయ్. అంతేకాదు కొంతమంది ఆటగాళ్ళను ఆయా టీమ్స్ రిటైన్ చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే చాలా టీమ్స్ తమకు కావాల్సిన ఆటగాళ్లను ఇతర టీమ్స్ నుంచి తమ జట్టులోకి తీసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని షాక్ లు తగులుతున్నాయి.


 ఇక గుజరాత్ టైటాన్స్ కి కూడా ఇలాంటి ఒక బిగ్ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు సీజన్లలోనే ఛాంపియన్ టీం గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ కి ఏకంగా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా దూరమైన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ పాండ్యా తన పాత టీమ్ అయిన ముంబై ఇండియన్స్ లోకి వెళ్లిపోయాడు. దీంతో అతని స్థానంలో ఎలాంటి అనుభవంలేని గిల్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. హార్దిక్ పాండ్యా వెళ్తే ఏంటి జట్టులో ఎంతోమంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళు రాణిస్తే ఇక గుజరాత్కు తిరుగు ఉండదని ఆ టీం అభిమానులు అందరూ కూడా అనుకున్నారు.


 అయితే గుజరాత్ టైటాన్స్ జట్టుకి మరో ఎదురు దెబ్బ తగలడం ఖాయం అన్నది తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ పాండ్యని కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ ఇక మరో స్టార్ ప్లేయర్ ను కూడా కోల్పోతుందట. ఆ జట్టు స్టార్ బౌలర్ షమిని ట్రేడింగ్ కోసం మరో ఫ్రాంచైజీ సంప్రదించినట్లు సమాచారం. జిటి సి ఓ ఓ అరవింద్ సింగ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రేడింగ్ కోసం ఆటగాళ్లను ఫ్రాన్సిలు నేరుగా సంప్రదించడం తప్పు అంటూ మండిపడ్డాడు. ఐపీఎల్ ట్రేడింగ్ విండో ఈనెల 12వ తేదీన ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఇక షమీ గుజరాత్ టైటాన్స్ లో ఉంటాడా లేదంటే మరో టీం లోకి మారతాడ అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: