గత 12 ఏళ్ల నుంచి టీమిండియాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోని.. టీమిండియా ఇటీవల ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ మొదలెట్టింది. అయితే వరుసగా 16 టెస్టు సిరీస్ లను సొంత గడ్డపై గెలుచుకున్న టీమిండియా.. ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఎలా రాణిస్తుందో అనే టెన్షన్ అందరిలో ఉండేది. ఎందుకంటే సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో అందరిలా నెమ్మది అయిన ఆట తీరును కాకుండా ఎటాకింగ్ గేమ్ తో గత కొంతకాలం నుంచి అదరగొడుతుంది ఇంగ్లాండ్ జట్టు.


 ఇంగ్లాండ్ హెడ్ కోచ్గా మెకళ్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక బజ్ బాల్ ప్రారంభించింది ఇంగ్లాండ్. అయితే ఈ కొత్త ఆట తీరును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ లో కూడా అటు ఇంగ్లాండ్ ఓడిపోలేదు. బజ్ బాల్ తర్వాత ఏకంగా ఏడు టెస్ట్ సిరీస్ లు ఆడింది. ఇందులో మూడింటిలో విజయం సాధిస్తే నాలుగు టెస్టు సిరీస్ లు డ్రాగ ముగిసాయి అని చెప్పాలి. దీంతో ఇక ఇప్పుడు ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఏం చేయబోతుందో అనే టెన్షన్ అందరిలో ఉంది. అయితే ఇంగ్లాండ్ బజ్ బాల్ ప్లాన్ రోహిత్ శర్మ తన వ్యూహాలతో  చిత్తు చేసేసాడు.


 బజ్ బాల్ తో వరల్డ్ క్రికెట్లో ఉన్న అగ్రశ్రేణి జట్లను వనికిస్తున్న ఇంగ్లాండ్ కు చివరికి రోహిత్ శర్మ జలక్ ఇచ్చాడు. తన పదునైన ప్లాన్స్ తో బజ్ బాల్ దూకుడుకు కళ్ళం వేశాడు రోహిత్ శర్మ. ఒకవైపు జట్టులో సీనియర్ ప్లేయర్లు గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్న అనుభవం లేని యువ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించిన హిట్ మాన్ బస్ బాల్ తో ఓటిమి లేకుండా దూసుకుపోతున్న ఇంగ్లాండుకు మొదటిసారి ఓటమి రుచి చూపించాడు. ఇలా ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ ప్రారంభించిన తర్వాత టెస్ట్ సిరీస్ లో ఓడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.  దీంతో ఇక రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ.. మ్యాన్ విత్ ప్లాన్ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: