గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ సమయంలో గాయం బారిన పడిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇక ఎన్నో రోజులు పాటు క్రికెట్ కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే గాయం తీవ్రత తక్కువగా ఉంటే మళ్ళీ జట్టులోకి వస్తాడని అందరూ అనుకున్నప్పటికీ.. వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం దూరం అయ్యాడు. కేవలం వరల్డ్ కప్ కి మాత్రమే కాదు ఆ తర్వాత టీమ్ మీడియా ఆడిన సిరీస్ లోకి కూడా అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గాయం నుంచి కోలుకుని  నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ మొదలు పెట్టిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.


 అయితే గత ఏడాది వరకు కూడా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ లో కొనసాగిన హార్దిక్ పాండ్యా ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో సరికొత్త ప్రస్తానని మొదలుపెట్టబోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ తో ముంబై జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇదే విషయంపై చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ సమయంలో తనకు అయిన చీలమండ గాయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ నుంచి వైదొలగడంపై మాట్లాడాడు హార్థిక్ పాండ్యా. గాయం తర్వాత  నేను ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తానని మేనేజ్మెంట్కు చెప్పాను. కానీ చీలమండ పై మూడు చోట్ల ఇంజక్షన్ ఇచ్చారు. అక్కడ రక్తం కూడా తీశారు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ.. మ్యాచ్ ఆడేందుకు పది రోజులపాటు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకున్నాను. పూర్తిగా కోలుకునేందుకు మూడు నెలల సమయం పట్టింది. ఇలా ఐదు రోజుల్లో వస్తాను అనుకున్న వాడిని చివరికి మూడు నెలల తర్వాత మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి బరిలోకి దిగాల్సి వచ్చింది అంటూ చెప్పుకోచ్చాడు హార్థిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl