మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి కూడా ఈ టి20 టోర్ని మొదలు కాబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఎప్పుడూ లాగానే ఈ ఏడాది కూడా ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ పొందెందుకు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే ప్రారంభ మ్యాచ్లో అటు చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు జట్ల మధ్య చపాక్ స్టేడియం మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.



 అయితే ఇప్పటికే అన్ని జట్లు కూడా అటు ఐపిఎల్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే  పక్క ప్రణాళికలతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇక అందరూ ఆటగాళ్లు కూడా ఆయా జట్ల యాజమాన్యాలు ఏర్పాటు చేసిన ప్రీ క్యాంపుల్లో చేరిపోతున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అందరూ దృష్టి ఒక ఆటగాడి పై పడబోతుంది. అతను ఎవరో కాదు గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో రికార్డ్ స్థాయిలో 24.5 కోట్ల ధర పలికిన ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్కు పైన. ఇక అతనికి దక్కిన ధరకు అతను న్యాయం చేస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 దీంతో అందరూ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ipl టోర్ని గురించి ఈ ఆస్ట్రేలియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఒక సర్కస్ లాగా ఎంటర్టైన్ చేస్తుంది అంటూ  స్టార్క్ చెప్పుకొచ్చాడు. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐపీఎల్లో ఆడటం ఒక కొత్త సవాలు. ఈ టోర్ని ప్రపంచంలోనే బెస్ట్ టి20 లీగ్ ఈసారి కొత్తగా జట్టుతో ఆడుతూ ఉండడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కాగా గతంలో 2014, 2015 సీజన్లలో అటు ఆర్సీబీ జట్టు తరపున ఆడిన మిచెల్ స్టార్క్ ఇక ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl