ఎడమ చేతి వాటం కలిగిన ఇండియన్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ గురించి ప్రత్యేక పరిచయం లేదు . ఈయన ఎన్నో సంవత్సరాలు తన అద్భుతమైన ఆట తీరుతో ఇండియన్ జట్టు కు ఎన్నో విజయాలను అందించాడు . ఇక ఈయన ఐ పీ ఎల్ లో కూడా ఎన్నో మ్యాచ్ లను ఆడి తన అద్భుతమైన ఆట తీరు తో ప్రేక్షకులను ఎంత గానో మెప్పించాడు . ఇక పోతే శిఖర్ ధావన్ 2012 వ సంవత్సరం లో తన కంటే 10 సంవత్సరాలు పెద్దది అయినటు వంటి ఆయేషా ను పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత వీరిద్దరూ ఎంతో సంతోషం గా చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా కలిసి జీవించారు . కానీ వీరికి ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడం తో పరస్పర అంగీకారం తో 2021 లో వీరు విడి పోయారు . ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా ఆ సమయం లో విరు విడుదల చేశారు . ఇకపోతే తాజాగా శిఖర్ ధావన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శేఖర్ ధావన్ మాట్లాడుతూ... నా పై గతంలో చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. వాటన్నిటిని నేను తట్టుకొని నిలబడ్డాను. ఒకా నొక సమయం లో నేను మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ అయినటువంటి మిధాలీ రాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నానని వార్తలు రాశారు. కానీ ఆ వార్తలు ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇలా దారుణమైన రూమర్స్ నాపై వచ్చాయి. వాటిని నేను ఎదుర్కొన్నాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఇండియన్ క్రికెట్ జట్టు ఆటగాడు శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sd