ఈ మధ్యకాలంలో ఫార్మట్ తో సంబంధం లేకుండా టీం ఇండియా ఎంత అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా పూర్తిస్థాయి ఆదిపత్యాన్ని చాలాయిస్తుంది. అలాంటి టీమిండియా ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం చెత్త ప్రదర్శన చేసింది. ఇక ఈ మధ్యకాలంలో టీమిండియా చేసిన అత్యంత చెత్త ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా గెలవకుండా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కోల్పోయింది టీమిండియా. అయితే గెలిచే మ్యాచ్లలో కూడా ఓడిపోయి చివరికి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే.


 మరి ముఖ్యంగా చివరి వన్డే మ్యాచ్లో అటు భారత జట్టు ఎక్కడ శ్రీలంకకు పోటీ ఇవ్వలేక 110 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూడటం అటు భారత అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఓటమికి గల మూడు ప్రధాన కారణాలు ఇవే అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

 బ్యాటింగ్ వైఫల్యం  : భారత జట్టులో ఎన్నడు లేనంతగా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ  ప్రదర్శన చేయలేదు.  కెప్టెన్ హిట్ మ్యాన్ 20 బంతుల 35 పరుగులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. ఆఖరిలో వాషింగ్టన్ సుందర్ పోరాడిన చివరికి ఉపయోగం లేకుండా పోయింది.

 సిరాజ్ : సిరాజ్ రూపంలో ఒకే స్పెషలిస్ట్ ఫేసర్ తో బలిలోకి దిగింది భారత జట్టు. అతను మాత్రం 9 ఓవర్లు వేసి 78 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో జట్టులో క్వాలిటీ ఫేసర్ లేకపోవడమే జట్టు ఓటమిని శాసించింది అని చెప్పాలి.

 విరాట్ కోహ్లీ  : ఈ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్ లలో  దారుణంగా విఫలమైన.. ఇక మూడో వన్డేలో 20 పరుగులు చేసి లయ అందుకున్నట్లు కనిపించాడు. కానీ అంతలోనే చివరికి వికెట్ కోల్పోయాడు. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ నిలకడగా ఆడాల్సింది పోయి విఫలం కావడంతో మిగతా ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం దెబ్బతిని త్వర త్వరగా అవుట్ అయ్యారు. ఇక ఈ మూడే అటు భారత ఓటమికి కారణమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: