ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్న నేపథ్యంలో వాతావరణం కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 30న ముల్లాన్‌పూర్‌లో జరగాల్సిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనుండగా మ్యాచ్ ను వర్షం ఆటకట్టిస్తే ప్లేఆఫ్ లెక్కలు మారిపోవచ్చు. ఐపీఎల్ నియమావళి ప్రకారం, ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో రిజర్వ్ డే కేవలం ఫైనల్ మ్యాచ్‌ కోసమే ఉంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే... లీగ్ దశలో ఎక్కువ పాయింట్లతో ముందున్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు.

ఈ లెక్కల ప్రకారం.. PBKS (పంజాబ్ కింగ్స్) 19 పాయింట్లతో  మొదటి స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ (MI) పాయింట్స్ పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే, పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ముంబై మాత్రం టోర్నీ నుండి వితొలగాల్సి వస్తుంది. మొత్తంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ చివరి దశకు చేరింది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో తలపడనుంది.

ఒకవేళ వాతావరణం సహకరించకపోతే, అంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన స్థానం పొందిన జట్టును ఫైనల్‌కు అర్హత కలిగిన జట్టుగా ప్రకటిస్తారు. ఈ లెక్కల ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇక్కడ మనించాల్సిన విషయం ఏమిటంటే.. క్వాలిఫయర్-2కి రిజర్వ్ డే ఉండదు. ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది.
ఇకపోతే, ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్‌ లలో గొప్ప అనుభవం కలిగి ఉంది. ఇప్పటివరకు 21 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడి 14 విజయాలు సాధించింది. ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై, నాక్‌ అవుట్ మ్యాచ్‌ల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించిన జట్టుగా పేరొందింది.

దీనికి భిన్నంగా పంజాబ్ జట్టు ఇప్పటివరకు కేవలం 5 ప్లేఆఫ్ మ్యాచ్‌లకే పరిమితమై ఉంది. అయినప్పటికీ, ఈ సీజన్‌లో పంజాబ్ అసాధారణ ప్రదర్శనతో లీగ్ దశను అగ్రస్థానంలో ముగించింది. అంతేకాదు, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6 మ్యాచ్‌లలో 4 విజయాలతో మంచి రికార్డును కూడా కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 33 సార్లు ఒకదానికొకటి తలపడగా, ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో గెలుపొందింది. పంజాబ్ కింగ్స్ 16 విజయాలు నమోదు చేసింది. మరి నేడు జరిగే పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికర అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl