
దశాబ్దాల కలను సహకారం చేసుకున్నామన్న సంతోషం ఓవర్ ఎక్సైట్ మెంట్ ఈ విషాదాన్ని కి ప్రధాన కారణం అంటున్నారు జనాలు . ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ కప్ బెంగళూరుకి రావడంతో ఆర్సిబికి ఘన స్వాగతం పలికేందుకు విజయోత్సవ వేడుకలు వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. పోలీసులు అభిమానుల రద్దిని కంట్రోల్ చేయలేకపోయారు . ఆ కారణంగానే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది . వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది .
11 మంది మరణించారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు..? ఆ బిడ్డల తల్లిదండ్రులకు ఎవ్వరు న్యాయం చేస్తారు..? అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్ లు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇదే నేపధ్యంలో ఐపీఎల్ నుంచి ఆర్సిబి ని బ్యాన్ చేయాలి అంటు డిమాండ్ చేస్తున్నారు . 18 ఏళ్ల తర్వాత కోహ్లీ టీం ఐపీఎల్ టైటిల్ గెలిచిందనే ఆనందం కన్నా కూడా ఈ సంబరాలు కారణంగా 11 మంది మరణించారనే బాధ ఎక్కువగా ఉంది అంటున్నారు జనాలు. వాళ్ళ కుటుంబాలని ఈ ఐపీఎల్ ఉద్ధరిస్తుందా..? అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు 18 ఏళ్లు ఆర్సిబిని బ్యాన్ చేయాలి అంటుంటే మరి కొంతమంది ఐపీఎల్ టీమ్ నుంచి టోటల్గా ఆర్సిబి ని సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!