బిగ్ బాస్ కొత్త ఆలోచన వల్ల గత మూడు నాలుగు ఎపిసోడ్స్ గందరగోళంగా మారాయి.. ఇంటి సభ్యులను తీసుకొచ్చిన బిగ్ బాస్ జనాలను అలాట్టుకోవడం మాట పక్కన పెడితే సోది చేస్తున్నారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అందరికీ సంబందించిన వారి ఇంటి సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చాడు.. కానీ మోనాల్ కు మాత్రం అన్యాయం చేశాడు. ఆమె కుటుంబ సభ్యులు రాలేదు అనే విషయాన్ని చెప్పాడు..అంతేకాదు తన తల్లి మాట్లాడిన ఆడియో క్లిప్ ను వినిపించాడు..



మోనాల్ పాపా ఎలా ఉన్నావు.. మేం ఇక్కడ బాగున్నాం.. నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు.. రోజూ నిన్ను టీవీలో చూస్తున్నాం. మేము హైదరాబాద్ రాలేకపోయాం.. మా గురించి ఆలోచించకు.. మంచిగా ఆడి.. అందరితో మంచిగా ఆడు’ అంటూ మోనాల్ తల్లి పంపిన ఆడియో సందేశాన్ని బిగ్ బాస్‌లో హౌస్‌లో వినిపించడంతో మోనాల్ బోరు బోరున ఏడ్చింది. రోజులాగే తన భాదను బాత్ రూం లోకి వెళ్లి ఏదో ఇంకా ఎప్పటికీ కలుసుకోలేరు అన్న విధంగా గుండెలు పగిలేలా ఏడ్చింది..



బిగ్ బాస్ హౌస్‌లోకి అతని సిస్టర్ అడుగుపెట్టి సర్ ప్రైజ్ చేసింది. తన సిస్టర్‌ని చూడగానే పరుగుపరుగున వెళ్లి తెగ ఏడ్చేసింది మోనాల్. ‘చాలా బాగున్నావు.. అమ్మ ఎలా ఉంది.. అమ్మ చాలా మిస్ అవుతుంది.. ఇక్కడకు వచ్చే ముందు కునాల్‌తో మాట్లాడావా .. నా గురించి అఖిల్ గురించి బయట చెడుగా అనుకోవట్లేదు కదా’ అని తన సిస్టర్‌ని అడిగింది మోనాల్.అభిజిత్ గురించి మోనాల్ అక్క హేమాలి సెటైర్లు వేయడంతో హర్ట్ అయిపోయింది హారిక. అభిజిత్ వెనకాల ఏం మాట్లాడతాడో.. ముందు కూడా అదే రిపీట్ చేస్తాడు.. అంటూ అరియానా, అభిజిత్‌ల ముందు తెగ ఫీల్ అయ్యింది హారిక. ఇక అఖిల్ అయితే మోనాల్ ముందు మీ అక్క చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు నచ్చేసింది అంటూ ఎప్పటిలాగే పులిహోర కలపడం ప్రారంభించాడు. 



అయితే అభిజిత్ విషయంలో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పిన హిమలి.. అఖిల్ గురించి నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా అని అడిగినప్పుడు అక్క మౌనంగా ఉంది.  దీని వెనుక అసలు రహస్యం ఏంటో తెలియలేదు... మోనాల్ అక్క మాటలు విన్న అఖిల్ మాత్రం సిగ్గుతో మెలికలు తిరిపోయాడు.. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ తో తలనొప్పి తెప్పిస్తాడో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: