ఇకపోతే అప్పుడప్పుడు నెటిజెన్లతో ముచ్చటించే ఈమె వారికి తగ్గట్టుగా సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు , వీడియోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న యాంకర్ రష్మికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. సమాజంలో జరిగే వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనదైన శైలిలో అందర్నీ అలరిస్తూ ఉంటుంది.. నిజానికి రష్మీకి బుల్లితెరలు ఇంత క్రేజ్ రావడానికి కారణం మరో కమెడియన్ సుడిగాలి సుదీర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన తో ఆమె చాలా సన్నిహితంగా ఉంటూ మరింత క్రేజీ సంపాదించుకోవడమే కాదు ఆయనతో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా కూడా తెగ వార్తలు వినిపించాయి.. అలాగే వీరిద్దరూ రొమాన్స్ లో కూడా బాగా రెచ్చిపోతూ ఉంటారు.. ఈ జంట వివాహం చేసుకోవాలని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు.తెర ముందు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి తెర వెనుక కూడా ఆమె ఎంతో మానవత్వాన్ని చాటుతూ ఉంటుంది. బయట జరిగే నేరాలను చూసి ఆమె అసలు తట్టుకోలేదు ఒక సెలబ్రిటీ హోదాను కూడా పక్కనపెట్టి అన్ని విషయాలలో బాధ్యత వహిస్తూ మానవజాతి పట్ల చేసే కొన్ని వ్యతిరేక చేష్టలను ఆమె తన మాటలతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది.అలాగే మూగజీవుల విషయంలో కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇటీవల ఒక ఫోటో షూట్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.." అంతా బాగానే ఉన్నావు కానీ ఆ కాళ్ళు ఏంటి అంత సన్నగా ఉన్నాయి" అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే ఒక నెటిజన్ రష్మీ పై చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి