ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ పేరిట గతంలో జరిగిన కొన్ని మోసాలను కూడా తెలియజేశారు. హౌస్ లోకి పంపిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే వారి చేతిలో మోసపోకూడదు అని తెలుపుతున్నారు. ఆదిరెడ్డి తనకు బిగ్ బాస్ హౌస్ లో తనకు కేవలం 25 లక్షల నుంచి 30 లక్షల వరకు పారితోషకం వచ్చిందని వెల్లడించారు.. తనకు బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశారు. మీరు బిగ్బాస్ రావడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా అని అడుగుతారు తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాకే అధికారిక వెబ్సైట్ నుంచి ఒక మెయిల్ పంపుతారు అందులో మన వివరాలను అడిగిమరి ఫిల్ అప్ చేసుకుంటారు. ఆ తర్వాతే జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతుంది అంటు తెలియజేశారు.
అక్కడే మనం రెమ్యూనరేషన్ వివరాలను కూడా మాట్లాడుకోవాలి అలాగే హెల్త్ చెకప్ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది.. ఏ వీలు, డాన్స్ సూట్ అన్ని కూడా జరిగిన తరువాతే హౌస్ లోకి పంపిస్తారంటూ తెలిపారు. రికమండేషన్ ద్వారా ఎవరైనా హౌస్ లోకి వెళ్లాలనుకుంటే అది అసాధ్యమని కూడా తెలిపారు. అందుకు సంబంధించి వీడియోను కూడా పోస్ట్ షేర్ చేశారు ఆదిరెడ్డి. ఎవరు కూడా ఎలాంటి విషయాలను నమ్మవద్దండి అంటూ తెలిపారు.