జబర్దస్త్ కమెడియన్ గా పేరు పొందిన పంచ్ ప్రసాద్ బాగానే పేరు సంపాదించారు . తనదైన స్టైల్ లో కామెడీ పంచ్ లతో విభిన్నమైన డైలాగులతో పేరు సంపాదించిన ప్రసాద్ అయితే చాలా కాలంగా తన ఆరోగ్యం బాగలేకపోవడంతో ఎక్కువ కామెడీ స్కిట్లలో కనిపించలేకపోయాడు. అప్పట్లో ఎక్కువగా కిడ్నీ సమస్యలు థైరాయిడ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు.అందుకు సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్లు సర్జరీలు కూడా జబర్దస్త్ ఆర్టిస్టులు చేయించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రసాద్ ఆరోగ్యం కుదుటపడడంతో ప్రస్తుతం జబర్దస్త్ తో పాటుగా పలు రకాల షోలలో కనిపిస్తూ ఉన్నారు.

తాజాగా.. జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో కమెడియన్ ప్రసాద్ కనిపించారు. ఈ సందర్భంగా అక్కడ ఎమోషనల్ గా మాట్లాడుతూ తనకి పునర్జన్మ ఇచ్చినటువంటి రోజా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు ప్రసాద్. యాంకర్ రవి ఈ షోలో ఇంతకు మీరు ఇక్కడికి వచ్చింది ఎవరికోసం ప్రసాద్ అంటూ చెప్పగా ఒక రోజా పువ్వు కలిగిన ఫోటో ని చూపిస్తూ ఉన్నారు ప్రసాద్.


ఈరోజు తాను ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను తన భార్య పిల్లలతో ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే మేడం మీరు పెట్టినటువంటి బిక్ష అంటూ రోజా అని పొగడ్తలతో మూన్ చేశారు ప్రసాద్.. నిజం చెబుతున్నాను మేడం అంటూ రోజా కాలు కూడా పట్టుకున్నారు ప్రసాద్. అంతేకాకుండా తనకు తన తల్లి ప్రాణం పోస్తే.. తన భార్య తనకు పునర్జన్మ ఇస్తే.. రోజా అని చూపిస్తూ అమ్మ నాకు మా అమ్మ కన్నా ఎక్కువ అంటూ చూపించారు. ప్రసాద్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్లుగా ఈ ప్రోమోలో కనిపించడం జరిగింది. మరి రోజా ఎలాంటి సహాయం చేసింది అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: