
చిన్న వయసు నుంచే కళారంగం వైపు తన తల్లిదండ్రులు తనని ప్రోత్సహించారని తనకు డాన్స్ ,యాక్టింగ్ అన్న ఎక్కువగా ఆసక్తి ఉన్నదని తెలిపింది. అలా 2015లో మిస్ విజయవాడ టైటిల్ ని, ఆ తర్వాత 2016లో కూడా మిస్ ఆంధ్ర సబ్ టైటిల్ ని కూడా గెలుచుకుంది సత్య శ్రీ. రామ్ ,కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలజ సినిమాలో కనిపించింది.ఆ తర్వాత ఎన్నో రకాల షార్ట్ ఫిలిమ్స్లలో కూడా నటించిన సత్య శ్రీ సీరియల్స్ లో అవకాశాలు వచ్చేలా చేశాయి.
అలా ముద్దమందారం, నిన్నే పెళ్ళాడుతా, త్రినయని తదితర సీరియల్స్ లో నటించింది.. 2022లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా తన టాలెంట్ తో హౌస్ లో బాగానే ఆకట్టుకున్న బయటకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ సీజన్ 2లో పాల్గొన్న సత్య శ్రీ ఇందులో తన లవ్ గురించి తెలియజేసింది.. తన ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవారని రోజు తనని చూసేందుకు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లేదానని కానీ ఒకరోజు అనుకోకుండా స్పెక్ట్ పెట్టుకొని వెళ్ళగా.. అబ్బాయి బాగున్నాయని చెప్పడంతో మురిసిపోయి..స్పెక్ట్ కోసం తల్లితండ్రుల దగ్గర చాలా ఇబ్బందులు పడ్డాను.. అయితే చివరికి తన పక్కింట్లో ఉండే ఒక అక్కని అడగగా సైట్ వస్తే కొనిస్తారని సలహా ఇచ్చింది.. అలా చివరికి సైట్ తెప్పించుకొని మరి..స్పెక్ట్ వచ్చేలా చేసుకున్న రోజే తెలిసింది హార్ట్ బ్రేకింగ్ అయ్యే విషయం బయటపడిందని..అతనికి మా అక్క నచ్చింది తాను కాదు అంటు చెప్పడంతో తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ గురించి తెలియజేసింది సత్య శ్రీ.