బిగ్ బాస్ తెలుగు సిజన్ 7 ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయింది శుభశ్రీ రాయగురు. బిగ్ బాస్ లో అన్ని టాస్కులలో కూడా తనదైన నటనతో బాగా ఆకట్టుకున్న ఈ బుల్లితెర నటి హౌస్ లో కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ చేసింది. హౌస్ లోకి రాకముందు పలు సీరియల్స్లలో ,సినిమాలలో నటించిన శుభశ్రీ క్రేజ్ పెంచుకుంది. గడచిన కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాతను ఎంగేజ్మెంట్ చేసుకుంది శుభశ్రీ. దీంతో తనకు కాబోయే భర్త పైన తన పైన పలు రకాల ట్రోల్స్ వినిపించడంతో తాజాగా ఆ విషయాల పైన స్పందించింది శుభశ్రీ.



ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్లో శుభశ్రీ మాట్లాడుతూ కొద్ది రోజులుగా శుభశ్రీ గురించి ఒక వార్త వినిపిస్తోంది.. అదేమిటంటే తన ఎంగేజ్మెంట్ తర్వాత డబ్బులు కోసమే అతడిని వివాహం చేసుకుంది అంటూ అలాగే తన భర్త తనకు సరిగా సెట్ కాలేదని చాలామంది ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించగా.. అందుకు శుభశ్రీ ఇలా స్పందిస్తూ.. తన ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చిన కామెంట్స్ ట్రోల్స్ కి తాను చాలా బాధపడ్డాను అంటూ తెలియజేసింది.తనకు కాబోయే భర్త పైన చాలామంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారని.


తనకు కాబోయే భర్త డార్క్ కలర్ లో ఉన్నారు అసలు నేను ఎవరిని లైఫ్ పార్టనర్ గా ఎంచుకోవాలా నాకు తెలుసు.. చెప్పడానికి మీరెవరు? అంటూ కౌంటర్ వేసింది. డబ్బుల కోసమే పెళ్లి అంటూ మాట్లాడిన మాటలు బుద్ధిలేని వారే మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యింది శుభశ్రీ. ముందు తనే ప్రపోజ్ చేశాడని ఆ తర్వాతే పెళ్లి ఒప్పుకున్నాము..వివాహమైన తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని చెప్పాను వాటికి కూడా ఎలాంటి షరతులు పెట్టలేదని తెలియజేసింది శుభశ్రీ. జూన్ 6వ తేదీన శుభశ్రీ తన బాయ్ ఫ్రెండ్ నిర్మాత నటుడు అజయ్ ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: