జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ పొట్టి నరేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిలు మీద వేసే డైలాగులకు ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎపిసోడ్లలో కూడా కనిపిస్తూ ఉంటారు. జబర్దస్త్ లో షబీనాతో పొట్టి నరేష్ లవ్ ట్రాక్ గతంలో ఓ రేంజ్ లో నడిచింది. అయితే ఈ విషయం పైన పలు రకరకాల గాసిపులు కూడా అప్పట్లో వినిపించాయి. కానీ సడన్గా షబీనా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది.


ఇది కొంతమేరకు షాక్ అనిపించిన.. షబినా విషయంలో పొట్టి నరేష్ తెగ సిగ్గుపడేవారు. కానీ ఆమె పెళ్లికి మాత్రం వెళ్లలేదు నరేష్. తాజా ఇంటర్వ్యూలో నరేష్ ఆమె పెళ్లికి వెళ్లకపోవడానికి కారణం తెలిపారు.. నా హైట్ వల్ల తనకి ఎప్పుడూ కూడా ప్రాబ్లం రాలేదని, పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం అంటూ ఉంటారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అయితే అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలనేది ఏమీ లేదు.. తనని తనని తన కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అంటూ తెలిపారు.


షబీనాతో లవ్ ట్రాక్ స్కిట్ మాత్రమే ఉండేది మా మధ్య ఏమీ లేదు. పెళ్లికి ముందు నాతో లవ్ ట్రాక్ లో ఉండేది.. అయితే అది క్రియేట్ చేసింది రోజా గారే మొదటిలో ఆమెకు కార్తీక్ అన్నతో లవ్ ట్రాక్ బాగా ఉండేది కానీ ఆ తర్వాత మళ్లీ నా వైపు కన్వర్ట్ అయింది.. ఈ విషయంపై నేను ఎన్నోసార్లు ఆమెను ఫ్లటింగ్ చేసే వాడిని అంటూ తెలిపారు నరేష్. అయితే ఆమె పెళ్లికి పిలిచింది కానీ తాను వెళ్లలేకపోయానని ఎక్కడో గుంటూరులో చేసుకోవడం వల్ల దూరమై వెళ్లలేదు అంటూ తెలిపారు. జబర్దస్త్ లో చాలామందిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటా కానీ వారు వీడియో పిల్లనాయలా అంటూ వదిలేస్తూ ఉంటారని నవ్వుతూ  తెలిపారు జబర్దస్త్  నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: