సాధారణంగా బిగ్ బాస్ షో అంటే చాలామంది ప్రజలకు కూడా పెద్దగా నచ్చదు. ముఖ్యంగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా నెగిటివిటీ తోనే బయటికి వస్తూ ఉంటారు. కానీ అందులో పాజిటివ్గా ఎవరైనా కంటెస్టెంట్స్ వచ్చారు అంటే అది మామూలు విషయం కాదు. మంచి వాళ్ళ లాగా వెళ్లినా కూడా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చెడ్డవాలుగా తిరిగి వస్తూ ఉంటారు. అలా మార్చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ షో.. అయితే ఒక ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పాజిటివ్ తో బయటికి వచ్చిన వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు.



హౌస్ లో మానస్ తో లవ్ ట్రాక్ వల్ల కొంతమేరకు నెగిటివిటీ ఏర్పడింది. అదొక్కటి మినహాయిస్తే ప్రియాంక  మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే బెటరు అంటూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో ఈమెకు సపోర్ట్ చేసే వారిలో మెగా బ్రదర్ నాగబాబుతో పాటు ఆయన కూతురు నిహారిక కూడా ఉన్నారట. అలా వీరిద్దరు ప్రియాంక సింగ్ కి ఓట్లు వేసి మరి గెలిపించాలని పోస్ట్లు పెట్టి సపోర్ట్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. నాగబాబుగారు చేసిన మేలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని తనని సొంత కూతురులా చూసుకున్నారు. అందుకే ఆయన పైన చాలా రెస్పెక్ట్ ఉంది .. నా జీవితంలో నేను ఎవరికైనా ఎక్కువగా రుణపడి ఉన్నానంటే నా కుటుంబం ,స్నేహితుల తర్వాత నాగబాబు గారికి మాత్రమే అంటూ తెలిపింది.



జబర్దస్త్ షోలో తనని నాలుగేళ్లు చూశారని అందులో కూడా తనమీద ఎలాంటి కంప్లైంటు లేవు. నేను చాలా పద్ధతిగా ఉంటూ,ఎవరిని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు నా పని నేను చేసుకుని వెళ్ళిపోయే దాన్ని అంటూ తెలిపింది ప్రియాంక. ఆ విషయం నాగబాబు గారికి చాలా ఇష్టము అందుకే తన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశారని తెలిపారు. ఈరోజుకి కూడా ఆ బాండింగ్ అలాగే ఉన్నదని.. ఈమధ్య బిజీగా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడలేదు.. వారితో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ వారి మీద రెస్పెక్ట్ అనేది తగ్గదు అంటూ తెలిపింది ప్రియాంక సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: