వీవో కంపెనీ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో వీవో తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 25వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. వీవో ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొత్త వీవో ఫోన్ లు కొనేవారు కూడా ఈ ఆఫర్ ను పొందవచ్చు. 
 
వీవో ఫోన్ ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ పాత ఫోన్లను ఇచ్చి 3,999 రూపాయల అదనపు బెనిఫిట్ లు పొందవచ్చు. ఫోన్ ను వీవో స్టోర్ నుండి బుక్ చేసుకుంటే 1,100 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్లు 10 శాతం వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి వీవో అప్ గ్రేడ్ & రివార్డ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
 
యాప్ లో లొకేషన్ ను సెట్ చేసుకొని క్లెయిమ్ యువర్ రివార్డ్స్ పై క్లిక్ చేస్తే స్క్రాచ్ కార్డులో రివార్డు ఏమిటో తెలిసిపోతుంది. క్విక్ సిల్వర్, పేటీఎం, క్యాషిఫై మొదలైన సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 60 వేల రూపాయల వరకు పొందవచ్చు. ఈ రివార్డుల్లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా 1,000 రూపాయల వరకు బెనిఫిట్ లు పొందవచ్చు. పేటీఎం నుండి అజియో, గానా, ఊబర్ ఈట్స్, మెక్ డొనాల్డ్, పూమా, ఓయో, బిగ్ బాస్కెట్, యూబర్ లాంటి ఆఫర్లను పొందవచ్చు. 
 
15 వేల రూపాయల డిస్కౌంట్ కూపన్లు మింత్రా, యారో, టైటాన్, లాక్మీ, బుక్ మై షో, మైక్ మై ట్రిప్ యాప్ లపై పొందవచ్చు. 2,999 రూపాయల విలువ గల బ్లూటూత్ ఇయర్ బర్డ్స్ ను, క్వాషిఫై ఈ స్టోర్ అనే యాప్ ద్వారా 1,100 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్లను పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: