ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ యుగం నడుస్తుంది. దాదాపు ఇప్పుడు ప్రతి ఇంటికి ఓ స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే జియో వచ్చిన సమయం నుండి స్మార్ట్ ఫోన్స్ లో నెట్ ఉపయోగం ఎక్కువ అయ్యింది. అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు వాడే ఆప్స్ లో వాట్స్అప్ తప్పకుండా ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్స్ వాడే వారందరూ వాట్సాప్ ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక మరికొంతమంది ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను కూడా వాడుతున్నారు. అయితే నిన్న రాత్రి 9 గంటల నుండి ఈ సోషల్ మీడియా సేవలు ఆగిపోయాయి. వాట్సాప్ లో ఎటువంటి మెసేజ్ లు వెళ్లడం కానీ రావడం కానీ జరగలేదు. దాంతో ప్రజలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే అదే సమయంలో ప్రజలందరూ ఈ వాట్సాప్ ఆగిపోయిన తర్వాత చేసిన మొదటి పని తమ మొబైల్లో నెట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. నెట్టు ఉన్న తర్వాత కూడా మెసేజ్ లు  ఎందుకు వెళ్లడం లేదని ఏదైనా ఇంటర్నెట్ సమస్య అయి ఉంటుందని ఫ్లైట్ మోడ్ ను ఆన్ చేసి ఆఫ్ చేసినవారు చాలామంది ఉన్నారు. అప్పటికి ఈ సోషల్ మీడియా ఖాతాలు పనిచేయకపోవడంతో తమ స్మార్ట్ ఫోన్లను ఓసారి స్విచాఫ్ చేసి ఆన్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు. అయితే అప్పటికే మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలు పని చేయడం లేదని తెలుసుకొని కాస్త నెమ్మదించారు. అయితే తే సరిగ్గా పడుకునే సమయంలో ఈ సోషల్ మీడియా ఖాతాలను తెరచి చూడడం ప్రజలకు ఓ అలవాటు అయిపోయింది. కానీ అదే సమయంలో ఇవి పనిచేయకపోవడంతో ప్రజలు ఏం చేయాలో తోచక ఉక్కిరి బిక్కిరి అయ్యారు అనడంలో సందేహం లేదు. దీనిని చూస్తుంటే మనం ఈ సోషల్ మీడియా ఖాతాలకు ఎంతగా బానిసలు అయ్యామో అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: