ప్రస్తుత రోజుల్లో అందరి వద్ద లాప్ టాప్ ఉంటోంది. చదువుకుంటున్న విద్యార్దులు, ఉద్యోగం చేస్తున్న వారు, వ్యాపారం చేసే వారు, ఇలా దాదాపు అందరూ లాప్ టాప్ లను వాడుతున్నారు. సెల్ఫోన్ లులా అందరి దగ్గర లాప్ టాప్ లు కూడా ఉంటున్నాయి. ఓటిటి పుణ్యమా అని ఎంటర్టైన్మెంట్ కోసం ఈ మధ్య చాలా మంది లాప్ టాప్ లు ఎక్కువగా వినియోగిస్తున్నారట. ఇక వర్క్ ఫ్రం హోమ్ ఎక్కువగా ఉండటంతో వారు కూడా లాప్ టాప్ లకే పరిమితమౌతున్నారు. ఇలా చాలామంది పలు విధాలుగా లాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. అయితే లాప్ టాప్ అయితే వాడుతున్నారు. కానీ దాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అని చాలామందికి సరిగా తెలియదు. తరచూ క్లీన్ చేసుకోకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది. కానీ లాప్ టాప్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువును క్లీన్ చేసుకోడానికి ఒక పద్దతి అంటూ ఉంటుంది. ఎలా పడితే అలా శుభ్రం చేస్తే పాడైపోతుంది. అయితే ఇంతకీ లాప్ టాప్ ను ఎలా తరచూ క్లీన్ చేసుకోవాలి అంటే..!!!

కిచెన్‌ టవల్స్‌, వాడిన బట్టలు, లేదా పేపర్‌ న్యాప్‌కిన్లు.. వంటి వాటితో లాప్ టాప్ స్క్రీన్ ని తుడవ కూడదు.  ఇవి కాస్త గరుకుగా ఉంటాయి, దాని వల్ల స్క్రీన్ పై మరకలు, గీతలు ఏర్పడి స్క్రీన్  పాడయ్యే ఆస్కారం ఉంది.   కాబట్టి స్క్రీన్‌ను మైక్రోఫైబర్‌ క్లాత్ తో శుభ్రం చేయడం మంచిది. ఇక కీ బోర్డ్ పాయింట్ వద్ద ఏ బ్రష్ పడితే ఆ బ్రష్ వాడకండి. మృదువుగా ఉండే... మేకప్‌ బ్రష్‌ వాడటం వలన కీబోర్డ్‌ డ్యామేజ్‌ కాకుండా దుమ్మును క్లీన్ చేయవచ్చు. కొంతమంది అయితే మూలల్లో,  గ్యాప్‌ లో ఇరుకున్న దుమ్మును క్లీన్ చేయడం కోసం కంప్రెస్‌డ్‌ ఎయిర్ టూల్స్‌ని వాడుతుంటారు.

అయితే ఇందులో నుండి వేగంగా, బలంగా వచ్చే  గాలి కారణంగా ల్యాప్‌టాప్‌లో లోని అతి సున్నితమైన భాగాలు విడిపోయే అవకాశం ఉందట అందుకనే వీటిని వాడరాదు. కిటికీ అద్దాలు, టీవీ స్క్రీన్‌.. వంటివి శుభ్రం చేసే లిక్విడ్స్‌నే ల్యాప్‌టాప్‌ స్క్రీన్ క్లీనింగ్‌ కోసం వాడేస్తుంటారు. చాలామంది అయితే ఇలా డైరెక్ట్ గా స్క్రీన్ పై స్ప్రే చేయకూడదట అందుకు బదులుగా ముందుగా  మైక్రోఫైబర్‌ క్లాత్‌పై స్ప్రే చేసి ఆ తర్వాత ఆ క్లాత్ తో ల్యాప్ స్క్రీన్ ని క్లీన్ చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: