కొత్త ఏడాది వచ్చిందంటే చాలు సరికొత్త రూల్స్ కు పెట్టింది నాంది.. అయితే ఈసారి మాత్రం నకిలీ సిమ్ములకు చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటోంది.ఎవరైనా నకిలీ సిమ్ కొన్న మూడేళ్ల జైలు తోపాటు 50 లక్షల జరిమానాను విధిస్తారట. వాస్తవానికి రాజ్యసభ పార్లమెంటు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు కూడా చట్టపరంగా మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో నకిలీ పత్రాల పైన నకిలీ సిమ్ములు కొనుగోలు చేసే వారి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్రం అందుకు తగ్గ కఠినమైన నిర్ణయాలను తీసుకుంటోంది.

మనం నకిలీ సిమ్ము వాడుతున్న సిమ్ము నకిలీదా కాదా అనే విషయం తెలుసుకోవడం అనేది కూడా చాలా సులభమే.. సంచార్ సౌదీ పోర్టల్ టెలి కమ్యూనికేషన్ శాఖ నకిలీ సిమ్ములను సైతం గుర్తిస్తుంది.
1). ఇందుకోసం..https://scancharasaathi.gov.in/ అనే పోర్టల్ కి లాగిన్ అవ్వాలి.

2). అక్కడ మీ మొబైల్ యొక్క కనెక్షన్లను సైతం తెలుసుకోవడం పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

3). అక్కడ మీ మొబైల్ యొక్క 10 అంకెల నెంబర్లను ఎంటర్ చేయాలి.

4). వీటితోపాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది.

5). అప్పుడే మీ పేరు మీద ఏవైనా నెంబర్స్ నమోదు అయ్యాయా లేవా అనే విషయాలను మనం గుర్తించవచ్చు. ఏదైనా నెంబర్ ని సైతం అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దానిని బ్లాక్ చేయడం మంచిది..

ముఖ్యంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ యొక్క కొత్త నిబంధనలను ప్రకారం కొత్త ఏడాది నుంచి మొబైల్ సిమ్ పొందాలంటే చాలా కఠినంగా మారుతుంది. సరికొత్త నిబంధనలకు అనుగుణంగా జియో ఎయిర్టెల్ ఇతర టెలికాం కంపెనీలు కూడా పలు రకాల బయోమెట్రిక్ వెరిఫికేషన్ సైతం పూర్తి చేయాలని తెలియజేస్తోంది. ఎవరైనా కంపెనీ నిబంధనలను టెలికాం సంస్థలు ఉల్లంఘిస్తే రెండు కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిమ్ కార్డుల అమ్మే దుకాణం లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: