
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్లైస్ బ్యాంకు లాంఛ్ చేసిన ఈ ఏటీఎం బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీలను మరింత సులభతరం చేయనుంది. కార్డు లేకుండానే సులువుగా డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. భవిష్యత్తులో ఈ తరహా ఏటీఎంలు మరిన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
యూపీఐ ఏటీఎం ఏర్పాటు చేయడం విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా సులువుగా డబ్బులు జమ చేసే అవకాశాలు సైతం ఉంటాయని సమాచారం అందుతోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు జరపడంతో పాటు యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
ఈ ఏటీఎం కొత్త ఖాతా మొదలుపెట్టే అవకాశంతో పాటు కియోస్క్ ఆధారిత సేవలు అందించే విషయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ బ్యాంకు కు సంబంధించిన సూపర్ కార్డును ఎలాంటి వార్షిక ఫీజు చెల్లించకుండా తీసుకోవచ్చు. ఈ కార్డుతో కొనుగోళ్లు చేయడం ద్వారా గరిష్టంగా 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు