
ఇక ఈ వీడియోలో చూసినట్లయితే .. ఆ మహిళ పిండిని తీసుకుని చకచకా చపాతీలను చేసింది. ఇక పెనానికి బదులు ఒకేసారి మూడు చపాతీలను వేసి కుక్కర్లో వేడి చేసింది. కుక్కర్ విజిల్, గ్యాస్‌కట్ కూడా తీయలేదు. మూడు నిమిషాలు ఆ చపాతీలను కుక్కర్లోనే ఉంచింది. ఇక అంతే.. రుచికరమైన నోరూరించే చపాతీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘అయ్యో.. ఇలా చేయాలని తెలియక, పెనం మీద వేసి కాల్చేస్తున్నామే’’ అని తెగ బాధపడిపోతున్నారట. మరియు ఇది చాలా చక్కని పద్ధతి అని, చపాతీలు ఆవిరి మీద సమానంగా ఉడుకుతాయని మరికొందరు విశ్లేషించి మరీ చెబుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు చూసి చపాతీలను చాలా ఈజీగా తయారు చేసుకోండి. హ్యాపీ గా తినేసేయండి.టైం సేవ్ చేసుకోండి.