
కానీ కొంతమంది మాత్రం ఏకంగా అసెంబ్లీకీ కనీస విలువ ఇవ్వకుండా ఇక్కడ విచిత్రంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టిన ఎంతోమంది మహిళలు ఏకంగా ఒకరినొకరు తోసుకుంటూ గొడవ పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే పంజాబ్ రాష్ట్రంలో. అయితే ఇది భారత్లో ఉన్న పంజాబ్ పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ప్రస్తుతం పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది అన్న విషయం తెలిసిందే.
ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయాడు. ఇక ఇలాంటి రాజకీయ సంక్షోభం సమయంలో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు కొట్టుకున్న ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. పంజాబ్ సీఎం ఏర్పాటు చేసిన ఒక విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మహిళా ఎమ్మెల్యేల మధ్య వివాదం మొదలైంది. చివరికి అది ఒకరిని ఒకరు కొట్టుకొనేనంత వరకు వెళ్ళింది. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇలా అసెంబ్లీలోనే మహిళా ఎమ్మెల్యేలు కొట్టుకోవడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.