ఒక ఆలోచన జీవితాన్ని మార్చి వేసింది అనే మాట అక్షరాల నిజం..ఒక ఐడియా వందల ప్రాణాలను కాపాడింది.ఎన్నో ప్రమాదాలు జరగ కుండా ఆపింది.ఇలాంటి ఆలోచనలు నోటికో, కూటికో ఒకరికి వస్తుంది.ఇప్పుడు బస్సు డ్రైవర్ కు వచ్చిన ఆలోచన అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది..బస్సుకు ఆయన అమర్చిన స్టీల్‌ బాల్‌ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజుది. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు ఆ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.


రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్‌ వ్యూ అద్దాలు ఉంటాయి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్‌కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బస్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయాణికులు, పాదచారులు అటు,ఇటూ తిరుగుతారు.కొన్నిసార్లు డ్రైవర్లు ఎవరూ లేరని బస్సులను పొనిస్తారు.


అలా చేయడం వల్ల గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే రెండు ప్రమాదాలు జరిగి, ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెండయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను, ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలని ఆ డ్రైవర్ తీవ్రంగా ఆలొచించారు.180 డిగ్రీల కుంభాకారపు స్టీల్‌ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి, దానిని డ్రైవర్‌ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్‌ బాల్‌లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్‌ డోర్‌ వరకూ కనిపిస్తోంది..దానికి అయ్యే ఖర్చు కూడా కేవలం 100 రూపాయలే కావడం తో ఆ ప్రాంతంలో తిరిగే అన్నీ బస్సులకు ఇలాంటిది ఏర్పాటు చేయాలనీ ఆర్ టీసీ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: