సాధారణంగానే మ్యాజిక్ షోలు చూసేందుకు ఎక్కువగా అందరూ ఇష్టపడుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మ్యాజిక్ షోలలో ఉండే జిమ్మిక్కులు మాయాజాలం అందరిని అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇక అక్కడ చూస్తున్న వారందరినీ కూడా ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎక్కడ ఎప్పుడు మ్యాజిక్ షో జరిగిన కూడా అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా కన్నారపకుండా ఆ మ్యాజిక్ షో ని వీక్షిస్తూ ఉంటారు.


 అయితే కొంతమంది మెజీషియన్లు ఇలా మ్యాజిక్ షో చేస్తూ దొరికిపోవడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ మరి కొంతమంది మాత్రం నిజంగానే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించి.. తమ మ్యాజిక్ తో అందరిని నువ్వు ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. పిట్టల్ని, బట్టల్ని కళ్ళ ముందే కనికట్టు చేసి ఏకంగా ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది మెజీషియన్లు కుర్చీపై కూర్చున్న అమ్మాయిని కేవలం క్షణాల వ్యవధిలో మాయం చేయడం లాంటివి చేసి చూపించారు.


 ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అని చెప్పాలి. కానీ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఒక మ్యాజిక్ కి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఓరి నాయనో ఇదెక్కడి మ్యాజిక్ రా బాబు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే రెప్పపాటు కాలంలో ఖాళీగా ఉన్న కుర్చీలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రత్యక్షమైంది. ముందుగా ఖాళీగా ఉన్న ఒక కుర్చీపై ఒక క్లాత్ కప్పుతాడు మెజీషియన్. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా ఆ క్లాత్ తీయగానే.. ఖాళీగా ఉన్న కుర్చీలో ఒక అందమైన అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. ఇది చూసి అక్కడున్న ప్రేక్షకులు ఎలా ఫీలయ్యారో కానీ... ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ మాత్రం నోరెళ్ళ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: