
కానీ ఇక్కడ కేవలం ఆడవాళ్లు మాత్రమే భయపడతారు అని మాట్లాడుకోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. బొద్దింకను చూస్తేనే భయపడే ఆడవాళ్లు ఏకంగా పాములను పట్టుకోవడం అంటే అది దాదాపు అసాధ్యమని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఎంతో ప్రమాదకరమైన విషపూరితమైన పామును ఏదో పొట్లకాయను చేతిలో పట్టుకున్నట్లుగానే పట్టుకుంది. ఇది చూస్తున్న నెటిజన్లకే భయం వేస్తుంది. కానీ అక్కడ పామును పట్టుకున్న మహిళ మాత్రం అస్సలు భయపడటం లేదు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఒక కారు ఇంట్లో పార్క్ చేసి ఉంది. అయితే ఆ ఇంట్లోనే అమ్మాయి కారులో బయలుదేరేందుకు సిద్ధమైంది. కానీ ఎంతకీ కార్ స్టార్ట్ కాలేదు. అంతేకాదు ఇంజన్ నుంచి ఏదో వింత శబ్దం రావడం మొదలైంది. ఏంటా అని ఇక కారు ఇంజన్ ఓపెన్ చేసి చూసి చూసింది ఆ అమ్మాయి. ఇంకేముంది అక్కడ ఒక విషపూరితమైన పాము కనిపించింది. అయినప్పటికీ ఆ అమ్మాయి ఎక్కడ భయపడకుండా చేతికి గ్లౌస్ వేసుకొని కారు ఇంజన్ భాగంలో దాక్కున్న పామును ఎంతో చాకచక్కగా బయటకు తీసింది. పొట్లకాయ చేతిలో పట్టుకున్నట్టుగానే పామును చేతిలో పట్టుకొని ఎలాంటి కంగారు లేకుండా పామును బయటకు తీసి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు.