పూర్వక రోజుల్లో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మన పూర్వీకులు తెలియజేస్తూ ఉండేవారు.ముఖ్యంగా రాయలు ఏలిన రతనాలసీమలో ఇంకా వజ్రాలు దొరుకుతూ ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఇప్పుడు తాజాగా చెప్పపోయే విషయం వింటే ఇది నిజమే అంటూరు.. అనంతపురం కర్నూలు జిల్లాలోని ప్రజలు రెండు జిల్లాలలోని సరిహద్దులు విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షం పడింది అంటే చాలు ఇక్కడి నేలల పైన పంటలు పండుతాయో లేదో కానీ వజ్రాలు మాత్రం దొరుకుతూ ఉంటాయని ప్రజల నమ్మకం..


అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడ ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. తాజాగా కురిసిన వర్షాలతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మరింత ఊపందుకుంది.. తొలకరి వాన రావడంతో వ్యవసాయం చేసుకోవడానికి పొలం దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉంటారు రైతులు.. కానీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు మాత్రం మొదటిసారి వర్షం పడితే చాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి పొలాలలో కూడా వెళ్లి వెతుకుతూ ఉంటారు.

రాయలసీమ నేలలు వజ్రాల ఘనులు ఉన్నాయనేది ఎప్పటినుంచి వినిపిస్తున్న వార్త మద్దికేర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ వినిపిస్తూ ఉంటుంది.. అయితే అక్కడికి ఇతర జిల్లాల నుంచి జనం కూడా వచ్చి వజ్రాల వేటను కొనసాగిస్తూ ఉంటారు విలువైన రాయలా అనిపిస్తే చాలు పరుగున వజ్రాల వ్యాపారల దగ్గరకు వెళ్తూ ఉంటారు రైతులు. తాజాగా నిన్నటి రోజున ఒక రైతుకు వజ్రం దొరకడంతో ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టేశాడు అయితే అక్కడికి వచ్చిన వ్యాపారస్తులు దాన్ని రెండు కోట్ల రూపాయల వరకు కొన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారడంతో మిగిలిన అక్కడ ఉన్న జనాలంతా పొలాలలో వెతుకులాటను తిరిగి ప్రారంభించారు. వర్షాలు పడుతున్నప్పుడే వజ్రాలు దొరుకుతాయని అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: