నేటి సమాజంలో చాల మంది దంపతులు ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేమి. పెళ్లి అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగడం లేదు. దీంతో దంపతులు మానసికంగా ఎంతో బాధకి గురవుతున్నారు. డాక్టర్స్ ని సంప్రదించడం మొదలు కొని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని జంటల్లో సమస్య మగవారిలో ఉంటే ఇంకొన్ని జంటల్లో స్త్రీలలో ఉంటుంది.