ప్రతి మహిళ అమ్మ అని పిలిపించుకోవాలని చాల కలలు కంటుంటారు. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. వారి తీసుకునే ఆహారం, జాగ్రత్తలు మీదనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇక గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు, ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఇక గర్భం దాల్చిన వారు పారాసిటమాల్ మాత్రలు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.