బిడ్డకు జన్మ ఇవ్వడమనేది స్త్రీల జీవితంలో అత్యద్భుతమైన, ఉద్వేగభరితమైన సంఘటనలలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భధారణకి ముందునుండే యోగా చేయడం వలన గర్భధారణ సమయంలో శారీరకంగా మానసికంగా ధృఢంగా చురుకుగా ఉండటానికి సహాయపడడంతో పాటుగా మిమ్మల్ని బిడ్డకు జన్మనివ్వడానికి అన్నివిధాలా సిద్ధం చేస్తుంది.