గర్భధారణ సమయంలో గర్భిణులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక చాలామందికి మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలీదు. గర్భవతి కాకముందు ఏది పడితే అదే తింటుంటారు. అయితే డాక్టర్లు సూచించినా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది పౌష్టికాహారం తీసుకోలేరు.