జపనీస్ ఫేమస్ కార్ బ్రాండ్ హోండా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్, భారతదేశంలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.ఇప్పటి వరకూ ఈ కారు ఐదు లక్షలకు పైగా కస్టమర్లకు చేరువైంది.హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2013లో తమ బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా విడుదల చేసిన అమేజ్ సెడాన్ తన 9 ఏళ్ల ప్రయాణంలో 5 లక్షల ఇళ్లను చేరుకుంది. భారతదేశంలో ఎస్‌యూవీలకు పాపులారిటీ పెరిగినప్పటికీ, హోండా అమేజ్ మాత్రం తన పాపులారిటీని కోల్పోలేదు. ఖరీదైన హోండా సిటీ సెడాన్‌ను కొనుగోలు చేయలేని వారికి హోండా అమేజ్ ఎల్లప్పుడూ ఓ మినీ సిటీ సెడాన్ లాగానే కనిపించింది.హోండా అమేజ్ తొలిసారిగా 2013లో భారత మార్కెట్లో విడుదలైంది. ఆ తర్వాత కంపెనీ ఇందులో 2018లో రెండవ తరం అమేజ్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ రెండవ తరం మోడల్ మార్కెట్లోకి వచ్చిన మూడేళ్లలోనే 2 లక్షల యూనిట్లు అమేజ్ కార్లు అమ్ముడయ్యాయి. హోండా నుండి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ మోడల్ కూడా అమేజ్ కావడంతో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.


ఇక హోండా అమేజ్ వల్ల భారతదేశంలో హోండా స్థానం చాలా వరకూ స్థిరపడిందని చెప్పొచ్చు. మొదట్లో హోండా కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తూ, చాలా పరిమిత సంఖ్యలో మార్కెట్ వాటాను కలిగి ఉండేది. కాగా, ప్రస్తుతం కంపెనీ మొత్తం విక్రయాల్లో 40 శాతం అమ్మకాలు హోండా అమేజ్ నుండే వస్తున్నాయంటే ఈ కారు ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. హోండా అమేజ్ పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.సెకండ్ జనరేషన్ అమేజ్ ఆధునిక ఫీచర్స్  కలిగి ఉన్న కారణంగా ఇది మునుపటి మోడల్ కన్నా వేగంగా అమ్ముడవుతోంది. హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంకా 1.5-లీటర్ i-DTEC ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి శక్తిని ఇంకా 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 98.6 బిహెచ్‌పి శక్తిని ఇంకా 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ ఇంకా సివిటి ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: