మా ఎన్నిక‌ల‌పై వివిధ వ్యాఖ్య‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. న‌టుడు, స్టంట్ మాస్ట‌ర్, చిరంజీవి స‌న్నిహితుడు జీవి
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌లు జ‌రిగే ప‌ద్ధ‌తి ఇది కాద‌ని, వ‌చ్చేసారి ప్రశాంత్ కిశోర్ ను తీసుకు వ‌చ్చి తాను పోటీ చేస్తాన ని అన్నారు. అదేవిధంగా కులాలు, మ‌తాలుగా విడిపోయి ఓటింగ్ జ‌ర‌గ‌డం, ప్రాంతాల పేరిట వాగ్వాదాలు న‌డ‌వ‌డం మంచిది కాద‌ని చెప్పారు. డ‌బ్బున్నోళ్లంతా జూబ్లిహిల్స్ లో, లేని వాళ్లంతా కృష్ణా న‌గ‌ర్ లో, మిడిల్ క్లాస్ వాళ్లంతా మ‌ణికొండ‌లో ఉంటున్నార‌ని,ఆ..వి ధంగా మా కూడా విడిపోయి ఎన్నిక‌లు నిర్వ‌హించే పద్ధ‌తికి ప్రాధాన్యం ఇస్తే ఇంకా బాగుంటుంద‌ని వ్యంగ్య ధోర‌ణిలో అన్నారు. మ‌రో వైపు ఎన్నిక‌లు ప్ర‌శాతంగా సాగుతున్నాయి అని మా మాజీ అధ్య‌క్షులు న‌రేశ్ అంటున్నారు. ఎన్నిక‌లు ఎలా జరిగినా, రేప‌టి వేళ తాము అంతా ఒక్క‌టేన‌న్న భావ‌న‌తో ఉంటామ‌ని ఇరు ప్యానెళ్ల స‌భ్యులు చెబుతున్న‌ప్ప‌టికీ అటువంటి సుహృద్భావ వాతావ‌ర‌ణం నెల‌కునేందుకు అవ‌కాశాలే లేవ‌ని ఇంకొంద‌రు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: