అందం కోసం ప్ర‌తి ఒక్క‌రూ తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ఏవేవో బ్యూటి క్రీమ్స్‌ను యూజ్ చేస్తారు. వేల‌కు వేలు ఖ‌ర్చు చేసి బ్యూటి పార్ల‌ర్స్ చూట్టూ తిరుగుతుంటారు. కానీ, అవి తాత్కాలిక ఫ‌లితాన్ని మాత్ర‌మే అందిస్తాయి. సాధార‌ణంగా చాలా అందం అంటే కేవలం మేకప్ అనుకుంటారు. చర్మం నిర్జీవంగా ఉంటే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తారు. కానీ, ఆహారంపై శ్రద్ధ మాత్రం పెట్ట‌రు. అందమైన మెరిసే చర్మానికి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. కానీ, ప్రస్తుతం కాలుష్యం, జంక్ ఫుడ్ అలవాట్లతో ఆరోగ్యం మాత్రమే కాదు. చర్మ సౌందర్యాన్ని కోల్పోతున్నాం. అయితే అది ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి ఆహార అలవాట్లు స్కిన్‌కి అస్స‌ల మంచివి కావు. 

 

దీని వల్ల చర్మం యవ్వనతత్వాన్ని, సహజత్వాన్ని కోల్పోతుంది. అందుకే సహజంగా దొరికే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ముఖ్యంగా పెరుగు. ఇది అందంగా, ఆరోగ్యానికి ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగులో ఉంటే విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, ఇతర మైక్రో మినిరల్స్ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా ఉండెలా చేస్తుంది. అలాగే పెరుగును రోజుకు రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల‌ చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను మచ్చలను తొలగిస్తాయి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. 

 

అంతే కాది చర్మంకు తేమను అందివ్వడంలో పెరుగు బాగా ప‌ని చేస్తుంది. ఇక ముఖ్యంగా వేడి వేడి ఎండ‌ల్లో చక్కెరతో నిండిన డెజర్ట్‌లకు బదులుగా పెరుగులో తేనే కలిపి తీసుకోవ‌డం చాలా మంచిదంటున్నారు నిపుణులు. మ‌రియు లస్సీ, మజ్జిగ ఎప్ప‌టిక‌ప్పుడు త్రాగండి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా, మెరుస్తూ ఉండేలా సాయపడుతుంది. అదేవిధంగా, పెరుగులో విటమిన్స్, మినిరల్స్, విటమిన్ బి12 , క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మైక్రోన్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందువల్ల రోజు ఒక కప్పు పెరుగు తినడం వల్ల వ్యాధుల భారిన పడకుండా కాపాడుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: