ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. షుగరింగ్ నొప్పిగా ఉండదు అనే అంటారు. అయితే, వాక్సింగ్ కంటే డెఫినెట్ గా నొప్పి తక్కువే అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. పైగా, మొదటి సారి కంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది.మూడు నుండీ ఐదు వారాల వరకూ డెఫినిట్ గా పని చేస్తుంది. మీ హెయిర్ గ్రోత్ ని బట్టి నాలుగు నుండీ ఆరు వారాల లోపు మళ్ళీ చేయవచ్చు.

షుగరింగ్ ఎక్కడైనా చేయవచ్చు అంటారు. అంటే, వాక్స్ చేసే అన్ని ప్లేసెస్ లోనూ షుగరింగ్ చేయవచ్చు.షుగరింగ్ చేసే ఏరియా ని ముందు క్లీన్ చేయాలి. ఆ తరువాత పౌడర్ అప్లై చేయాలి. ఇందు వల్ల స్కిన్ కీ, షుగర్ పేస్ట్ కీ మధ్య కొంత డిస్టెన్స్ ఏర్పడుతుంది.

స్కిన్ ని ఇలా ప్రెప్ చేసిన తరువాత షుగర్ పేస్ట్ కొంచెం వెచ్చగా ఉండగానే హెయిర్ గ్రోత్ కి వ్యతిరేక దిశలో అప్లై చేయాలి. డ్రై అయిపోయిన పేస్ట్ ని హెయిర్ గ్రోత్ ఉన్న డైరెక్షన్ లో తీసేయాలి. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ లో రిడక్షన్ కనిపిస్తుంది. అంతే కాక పెరుగుతున్న హెయిర్ కూడా ఇంతకు ముందు కంటే సన్నగా, ఫైన్ గా పెరుగుతుంది. అయితే, షుమారుగా క్వార్టర్ ఇంచ్ హెయిర్ గ్రోత్ ఉంటే తప్ప షుగరింగ్ చేయడానికి వీలుపడదు.


షుగరింగ్ లో జెల్ వంటి పేస్ట్ ని హెయిర్ రిమూవల్ కి యూజ్ చేస్తారు. ఈ పేస్ట్ ని నీరు, పంచదార, నిమ్మరసం కలిపి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకూ వేడి చేసి తయారు చేస్తారు. అన్‌వాంటెడ్ హెయిర్ ఉన్న ప్రతి చోటా షుగరింగ్ చేయవచ్చు. ఇది స్కిన్ యొక్క టాప్ లేయర్ కి స్టిక్ అవ్వదు కాబట్టి లైవ్ స్కిన్ సెల్స్ ని లాగకుండా ఉంటుంది. ఇది హెయిర్ ని రూట్ నుండి రుమూవ్ చేస్తుంది. ఇది ప్రత్యేకించి ఇన్‌గ్రోన్ హెయిర్, కర్లీ హెయిర్ కి ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: