
ఇక పెదవులు తేమను చాలా ఈజీగా కోల్పోతాయి. ఎందుకంటే ఇది మన ముఖం మీద స్కిన్ పై సన్నగా సున్నితంగా ఉండే లేయర్. కాబట్టి పగిలిన ఇంకా పొడిబారిన పెదాలను సాఫ్ట్ గా మార్చుకోవడానికి అలాగే చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి ఇంకా మీ పెదాలను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేస్తూ ఉండాలి. దీని వల్ల పెదాలు ఎంతో మృదువుగా అవుతాయి.ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే పెదాలు అస్సలు నల్లగా అవ్వడానికి కారణం ధూమ పానం. సిగిరెట్ లో నీకోటిన్ అనే పదార్ధం సున్నితమైన పెదాలకు అస్సలు మంచిది కాదు. దీనివల్ల పెదాలు బాగా నల్లబడిపోతాయి. కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి.ఇక పెదాలు మృదువుగా అవ్వడానికి బాదం నూనె చాలా మంచిది.ప్రతి రోజు రాత్రి పెదవులపై బాదం నూనెను రాసి కాసేపు మసాజ్ చెయ్యండి. ఇలా రెగ్యులర్ గా మసాజ్ చెయ్యడం వల్ల రక్త ప్రవాహం నియంత్రణలో ఉంటుంది.అలాగే పెదాలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. తద్వారా పెదాలు ఎర్రగా ఉంటాయి.