దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌డంతో అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పొడిగించాల‌ని అనుకుంటున్నాయి. వాస్త‌వంగా కేంద్ర ప్ర‌భుత్వం దేశం అంతా ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంటే మూడు వారాల పాటు నిర‌వ‌ధికంగా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది. అయితే ప‌రిస్థితులు కంట్ర‌ల్లోకి రాక‌పోవ‌డంతో దేశంలోని ప‌లు రాష్ట్రాలు లాక్ డౌన్ మ‌రి కొంత కాలం పొడిగిస్తున్నాయి. ఇప్ప‌టికే దేశంలో లాక్ డౌన్ పొడిగించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఒడిశా ముఖ్య‌మంత్రి నవీన్ ప‌ట్నాయ‌క్ ఇప్ప‌టికే లాక్ డౌన్ ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు ఆదేశాలు జారీ చేశారు.

 

ఇప్పుడు మ‌రో రాష్ట్రం కూడా లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. పంజాబ్ మే 1వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నామ‌ని స్ప‌స్టం చేసింది. పంజాబ్‌లో క‌రోనా కేసులు ఎక్కువ అవ్వ‌డంతో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కార‌ణంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా పూర్తిగా త‌గ్గిపోయింద‌ని ఆయ‌న చెప్పారు. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వహించ‌నున్నారు. ఆ త‌ర్వాత లాక్ డౌన్‌పై దేశ‌వ్యాప్తంగా పూర్తి క్లారిటీ రానుంది. మోదీ నిర్ణ‌యం ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణ సైతం లాక్‌డౌన్‌పై ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా వెళుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: