తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ముగిసింది. ప్రిసిడింగ్ అధికారి శ్వేతా మ‌హంతి ఈ ఎన్నిక‌ను నిర్వ‌హించారు. ఇక మేయ‌ర్ అభ్య‌ర్థిగా టీఆర్ఎస్ ప్ర‌తిపాదించిన గ‌ద్వాల్ ఆర్‌. విజ‌య‌ల‌క్ష్మి. కీల‌క రాజ‌కీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు కెకె. కుమార్తె. ఆమె ఖైర‌తాబాద్ నియోజ‌క‌వర్గంలోని బంజారాహిల్స్ డివిజ‌న్ నుంచి 2015లో తొలిసారి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. అప్పుడే ఆమె మేయ‌ర్ పీఠం ఆశించారు. అయితే కేసీఆర్ ఆమెకు కాకుండా బొంతు రామ్మోహ‌న్‌కు ఈ ప‌ద‌వి ఇచ్చారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆమె అదే డివిజ‌న్ నుంచి వ‌రుస‌గా రెండోసారి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. ఇప్పుడు ఎంఐఎం పొత్తుతో ఆమె మేయ‌ర్ పీఠంపై కూర్చొన్నారు. ఇక ఆమెకు అమెరికాలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అమెరికాలో ఉంటోన్న భ‌ర్త బాబీ రెడ్డి ఆమెను రాజ‌కీయంగా ఎంతో ప్రోత్స‌హించారు. అన్ని భాష‌ల్లోనూ ప‌ట్టు ఉండ‌డంతో పాటు రాజ‌కీయ నేప‌థ్యం ఉండ‌డం ఆమెకు క‌లిసి వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: