దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను చూసి రాష్ట్రం అంతటా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇవి 20 వేలకు పైనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా కట్టడికి కొన్ని చర్యలకు ఉపక్రమించింది. ప్రతి ఆదివారం లాక్ డౌన్ ప్రకటించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆదివారం లాక్ డౌన్ ప్రకటిస్తే కొంత వరకూ కంట్రోల్ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్ డౌన్ తప్పనిసరి కానుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: