లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మలాద్ ఈస్ట్ పోలీసులు చౌహాన్‌ అదుపులోకి తీసుకున్నారు. ఒక గుర్తు తెలియని అమ్మాయి చౌహన్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఇండియన్ పీనల్ కోడ్ 354,342,323, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

చౌహాన్ "కసౌతి జిందగీ కే"తో తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే అతను "షాదీ ముబారక్‌"లో కనిపించాడు. యూట్యూబ్ కామెడీ ఛానెల్ స్కెచ్ షోలో చౌహాన్ కూడా రెగ్యులర్ గా కన్పిస్తుంటాడు. కాగా ఇటీవలే ఇటీవలే పెర్ల్ వి పూరి అనే నటుడిని కూడా మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు. మరి చౌహన్ విషయంలో ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: