ఏపీ, తెలంగాణ మ‌ధ్య జ‌ల‌వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ అంశాన్ని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఈరోజు లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. తెలంగాణ అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని, త‌మ ప్ర‌భుత్వాన్ని ఏనాడూ సంప్ర‌దించ‌లేద‌ని ఆరోపించారు. కేంద్రం విడుద‌ల చేసిన గెజిట్ నోటిఫికేష‌న్‌పై ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు సంధించారు. విభ‌జ‌న హామీల ప్ర‌కారం కాకుండా ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఎంపీ మండిప‌డ్డారు. దీనికి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల‌ను దృష్టిలో ఉంచుకొనే గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశామ‌ని చెప్పారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎటువంటి వివాదాల‌కు తావులేకుండా చూస్తున్నామ‌న్నారు. ఉభ‌య స‌భ‌ల్లో విప‌క్షాలు నిర‌స‌న‌లు చేస్తున్న నేప‌థ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను వాయిదా వేశారు. అలాగే లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా కూడా స‌భ‌ను 12.00 గంటల వరకు వాయిదా వేశారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య కృష్ణా న‌దీ జ‌లాల పంప‌కంపై వివాదం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag